డీజేలకు అనుమతి లేదు: ఎస్పీ
NEWS Aug 23,2025 11:27 pm
జగిత్యాల: గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో గణేష్ మండపాల వద్ద శోభాయాత్రలో నిబంధనలకు విరుద్ధంగా డీజేలు, అధిక శబ్దాలు చేసి సౌండ్ సిస్టంలపై పూర్తిస్థాయిలో నిషేధం ఉందని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. శనివారం జిల్లా నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. డీజేలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తే డీజే యజమానులతో పాటు మండపాల నిర్వహకులపై కేసులు నమోదు చేయాలనీ అధికారుల్ని ఆదేశించారు.