రోడ్డు ప్రమాద బాధితులకు సీఐ సహాయం
NEWS Aug 23,2025 09:34 pm
కోరుట్ల: వెంకటాపూర్ గ్రామ శివారులోని ఎల్లమ్మగుడి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రుద్రాంగి గ్రామానికి చెందిన సాగర్ తన కుటుంబ సభ్యులతో కలిసి జగిత్యాల వెళ్లి తిరిగి వస్తుండగా, ఎదురుగా వచ్చిన లారీ కారణంగా ద్విచక్రవాహనం అదుపు తప్పి ప్రమాదం జరిగింది. ఇందులో సాగర్ కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో జగిత్యాల నుండి కోరుట్ల వస్తున్న సీఐ సురేష్‌బాబు సంఘటనను గమనించి, క్షతగాత్రులను వెంటనే తన వాహనంలో కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన కుటుంబ సభ్యులు క్షేమంగానే ఉన్నారని సీఐ తెలిపారు. ఆపద సమయంలో మానవత్వం చాటిన సీఐని గ్రామస్థులు అభినందించారు.