స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్
NEWS Aug 23,2025 07:46 pm
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. సీఎం అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా 42 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని తీర్మానించింది. ప్రస్తుతం ఈ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉండడంతో, పార్టీ పరంగానే రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు సీఎం.