మెట్‌పల్లిలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు
NEWS Aug 23,2025 06:37 pm
మెట్‌పల్లి: పట్టణంలో నేరాలను అరికట్టడం, ప్రజల రక్షణ, సమాజ శాంతి భద్రతల దృష్ట్యా మెట్‌పల్లిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్‌ఐ కిరణ్‌కుమార్ తెలిపారు. పట్టణంలోని పలు ముఖ్య కూడళ్లలో ఈ సీసీ కెమెరాలను అమర్చడం ద్వారా నేరాల నియంత్రణకు తోడ్పడటమే కాకుండా, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నా వెంటనే గుర్తించే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు.