ర్యాంకులు ప్రామాణికం కాదు - సీజేఐ
NEWS Aug 23,2025 06:17 pm
లా విద్యార్థులు ర్యాంకుల కంటే సబ్జెక్టు గురించి అవగాహన పెంచుకునేందుకు కృషి చేయాలని అన్నారు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్. అంకిత భావం, సంకల్పం, నిబద్దత వల్లనే సక్సెస్ వస్తుందన్నారు. పనాజీ సమీపంలోని మిరామార్‌లోని ఎంఎం సల్గావ్కర్ కాలేజ్ ఆఫ్ లా స్వర్ణోత్సవ వేడుకలలో సీజేఐ పాల్గొన్నారు. న్యాయ విద్యా వ్యవస్థ ఒక నమూనా మార్పును తీసుకుందని ఆయన పేర్కొన్నారు. గతంలో కంటే ఇప్పుడు లాలో పెను మార్పులు చోటు చేసుకున్నాయని వాటిని గుర్తించాలని సూచించారు.