క్రికెట్ బ్యాట్ కోసమే సహస్ర హత్య
NEWS Aug 23,2025 03:12 pm
కేవలం క్రికెట్ బ్యాట్ కోసమే సహస్రను బాలుడు చంపేశాడని వెల్లడించారు సీపీ అవినాష్ మహంతి. ఆ బ్యాట్ ను చోరీ చేసేందుకు వెళ్లి హత్య చేశాడన్నారు. బ్యాట్ దొంగతనం చేసింది చూసి పాప అరిచిందని, దీంతో భయంతో వెంట తెచ్చుకున్న కత్తితో బాలికను పొడిచాడని తెలిపారు. నిందితుడు పోలీసులను తప్పు దారి పట్టించాడని , హత్యకు వాడిన కత్తి, ఇతర ఆధారాలను సేకరించామన్నారు.