ముత్యంపేట కేడీసీసీ సొసైటీ సీఈఓకి సన్మానం
NEWS Aug 23,2025 06:38 pm
మెట్‌పల్లి: కేడీసీసీ బ్యాంక్ మెట్‌పల్లి బ్రాంచ్ పరిధిలోని ముత్యంపేట సొసైటీ సీఈఓ బొజ్జ రమేష్ ఉత్తమ ఎంప్లాయీ అవార్డు అందుకున్న సందర్భంగా ఆయనకు ఘన సన్మానం జరిగింది. మాజీ సింగిల్ విండో చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి రమేష్‌ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ రేవంత్ కుమార్, బ్యాంకు సిబ్బంది, మాజీ సర్పంచ్ తిరుపతి రెడ్డి, సంఘ కార్యదర్శులు,సిబ్బంది పాల్గొన్నారు.