టంగుటూరికి చంద్రబాబు నివాళి
NEWS Aug 23,2025 12:59 pm
టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు సీఎం చంద్రబాబు. ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడిగా గుర్తింపు పొందారు. అంతే కాకుండా ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశారని గుర్తు చేశారు. 1940, 50 దశకాల్లో ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందారని తెలిపారు. ఆయన చివరి నిమిషం వరకు ప్రజల కోసం పని చేశారని కొనియాడారు సీఎం.