మంత్రి రాసలీలపై చర్యలేవి..?
NEWS Aug 23,2025 12:53 pm
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కూటమి సర్కార్ లో ఉన్న మంత్రి రాసలీల గురించి టీడీపీ అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి బయట పెట్టారని తెలిపారు. పెద్ద హోటల్స్ లో దిగే ఆ మంత్రి తాగి తందనాలు ఆడేవారని, తనను నమ్ముకుంటే పదవులు వస్తాయని ప్రలోభాలకు గురిచేసి మహిళలను లొంగ దీసుకునే వారన్నారు. గతంలోనూ హైదరాబాద్ లో ఆ మంత్రి రాసలీల గురించి వార్తలు వచ్చాయన్నారు. ఆ మంత్రి ఎవరో టీడీపీ, జనసేన నేతలకు తెలుసన్నారు. మరి ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించారు భూమన.