ధర్మస్థల కేసులో బ్లోయర్ అరెస్ట్
NEWS Aug 23,2025 12:24 pm
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటకలోని ధర్మస్థల హత్యల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ గుడిలో స్కావెంజర్ గా పని చేసిన విజిల్ బ్లోయర్ తానే మృత దేహాలను పూడ్చి వేశానని, కొన్నింటిని దహనం చేశానని, మరికొన్నింటిని నదిలో వేశానంటూ ఆరోపించాడు. దీనిపై కర్ణాటక సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది. విచారణ చేపట్టిన సిట్ తను చెప్పినవన్నీ అబద్దాలంటూ బ్లోయర్ ను శనివారం అదుపులోకి తీసుకుంది.