రంగా విగ్రహానికి అవమానం సీఎం ఆగ్రహం
NEWS Aug 23,2025 11:50 am
ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో వంగవీటి మోహన్ రంగా విగ్రహం పట్ల గుర్తు తెలియని దుండగులు దుశ్చర్యకు పాల్పడటాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు . ఇలాంటి చర్యలను సహించ బోనంటూ వార్నింగ్ ఇచ్చారు.