సైబర్ నేరగాళ్ల వలలో నారాయణ అల్లుడు
NEWS Aug 23,2025 11:19 am
సైబర్ నేరగాళ్ల వలలో పడ్డాడు మంత్రి నారాయణ అల్లుడు పునీత్. తన పేరుతో కంపెనీ అకౌంటెంట్ కి మెసేజ్ పంపారు యూపీకి చెందిన ముగ్గురు సైబర్ నేరగాళ్లు. అర్జెంట్ గా రూ.1.96 కోట్లు కావాలని మెసేజ్ రావడంతో నగదు ట్రాన్స్ ఫర్ చేశాడు అకౌంటెంట్. దీంతో మోసం జరిగిందని వెంటనే ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అరవింద్ కుమార్ తో పాటు సంజీవ్ అనే నిందితుడిని అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.