నాగార్జున సాగర్ ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లు ఎత్తివేత
NEWS Aug 23,2025 10:39 am
వరద ఉధృతి కొనసాగుతోంది నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు. 26 గేట్లు పది అడుగుల మేర పైకి ఎత్తి 3 లక్షల 58 వేల 306 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 4,45,402 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 4,05,333 క్యూసెక్కులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 584.10 అడుగుల వద్ద నీళ్లు ఉన్నాయి. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలకు చేరుకుంది. నీళ్లు నిండు కోవడంతో ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.