బీఆర్ఎస్ శ్రేణులను వేధిస్తే ఊరుకోం
NEWS Aug 23,2025 08:33 am
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సీరియస్ అయ్యారు. నాగర్ కర్నూల్ జిల్లాలో పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల మాటలు విని తమ పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతలను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తమ వారిని ఇబ్బందులకు గరి చేసే ప్రతి ఎస్ఐ, సీఐ, డీఎస్పీల పేర్లు రాసుకుంటున్నాం అన్నారు. తమ సర్కార్ వచ్చాక మీరు ఎక్కడున్నా వదిలి పెట్టమని వార్నింగ్ ఇచ్చారు.