తెలంగాణ భూమి పుత్రుడు సురవరం
NEWS Aug 23,2025 08:27 am
సీపీఐ అగ్ర నేత సురవరం సుధాకర్ రెడ్డి మృతి చెందడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మాజీ సీఎం కేసీఆర్. చివరి దాకా పీడిత వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన అరుదైన నాయకుడని పేర్కొన్నారు. తెలంగాణ మట్టి బిడ్డ సురవరం సుధాకర్ రెడ్డితో తెలంగాణ ఉద్యమ సమయంలో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. తాను రెండుసార్లు ఎంపీగా ఉన్నా విలువల కోసం కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. దేశ , రాష్ట్ర రాజకీయాలలో కీలకమైన పాత్ర పోషించారని కొనియాడారు.