సురవరం మృతి బాధాకరం - సీఎం
NEWS Aug 23,2025 08:22 am
సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థి దశ నుంచి వామపక్ష భావజాలం కలిగిన సురవరం చివరి వరకు నమ్మిన సిద్ధాంతం కోసం అవిశ్రాంత పోరాటం చేశారని కొనియాడారు. దేశ రాజకీయాల్లో, వామపక్ష రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారని అన్నారు. ఆయన మృతితో దేశం గొప్ప ప్రజాస్వామిక వాదిని కోల్పోయిందని పేర్కొన్నారు. సురవరం మృతి పాలమూరు జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు అని అన్నారు సీఎం.