సురవరం మృతి తెలంగాణకు తీరని లోటు
NEWS Aug 23,2025 08:18 am
సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి తెలంగాణ ప్రాంతానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సురవరం వామపక్ష నేతగా గుర్తింపు పొందారని, ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వన్నె తెచ్చారని కొనియాడారు. చివరి శ్వాస వరకు ప్రజల బాగు కోసం తపించిన గొప్ప నాయకుడు అని ప్రశంసించారు.