అమెరికాలో టూరిస్టు బస్సు బోల్తా
NEWS Aug 23,2025 08:15 am
అమెరికాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నయాగరా జలపాతం అందాలను చూసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా బోల్తా పడింది టూరిస్ట్ బస్సు. న్యూయార్క్ లోని పెంబ్రోక్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా , పలువురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 54 మంది టూరిస్టులు ఉన్నారు.