సురవరం అరుదైన రాజకీయ నేత
NEWS Aug 23,2025 08:10 am
సీపీఐ అగ్ర నేత సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. సమకాలీన రాజకీయ నాయకుడిగా ఆయనతో కలిసి పని చేశానని ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. ఏ పదవిలో ఉన్నా విలువలతో కట్టుబడి ఉన్నారని, చివరి దాకా ప్రజల బాగు కోసం పని చేశారని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తున్నట్లు తెలిపారు సీఎం.