శ్రీశైలం ప్రాజెక్టు కళకళ
NEWS Aug 23,2025 08:02 am
ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది శ్రీశైలం ప్రాజెక్టుకు. నిండుకుండగా మారింది. జలాశయం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 4.73, ఔట్ ఫ్లో 5.14 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఇన్ ఫ్లో 4.45, ఔట్ ఫ్లో 4.05లక్షల క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.91 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 3.92 లక్షల క్యూసెక్కుల వద్ద నీరు నిలిచింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు వెల్లడించారు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.