శాంతించిన గోదావరి, కృష్ణా నదులు
NEWS Aug 23,2025 07:57 am
ప్రకృతి కరుణించింది. నిన్నటి దాకా ఉగ్ర రూపం దాల్చిన గోదావరి, కృష్ణా నదులు శాంతించాయి. వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. భద్రాచలం వద్ద ప్రస్తుతం నీటి మట్టం 39.5 అడుగులకు చేరుకుంది. కూనవరం వద్ద నీటి మట్టం 18.99 మీటర్లు ఉండగా పోలవరం వద్ద 12.65 మీటర్లకు చేరింది. ధవళేశ్వరం వద్ద ఇన్ , అవుట్ ఫ్లో 12.34 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.