గోదావరి నీటిమట్టం తగ్గుముఖం
NEWS Aug 23,2025 06:39 pm
భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం క్రమంగా తగ్గుముఖం దిశలో ఉంది. శనివారం ఉదయం 7 గంటలకు నీటిమట్టం 39.20 అడుగులు గా నమోదైంది. జిల్లా కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ ఆదేశాల ప్రకారం వరద పరిస్థితులను సన్నద్ధంగా పర్యవేక్షిస్తున్నారు. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండవలసిందిగా సూచిస్తూ, అవసరమైతే అధికారుల సూచనలను పాటించాలని హెచ్చరించారు.