కామ్రేడ్ సురవరం కన్నుమూత
NEWS Aug 22,2025 11:33 pm
సీపీఐ అగ్ర నేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయన స్వస్థలం పాలమూరు జిల్లా. తను నల్లగొండ నుంచి ఎంపీగా రెండుసార్లు గెలుపొందారు. ఆయన వయసు 83 ఏళ్లు. కార్మికుల హక్కులు, సామాజిక భద్రతా ప్రయోజనాల కోసం అంకితభావంతో పని చేశారు. 2012 నుండి 2019 వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కర్నూలులో విద్యార్థి నాయకుడిగా ఆయన రాజకీయ ప్రయాణం ప్రారంభమైంది.