వినాయక మండపాల నిర్వాహకులకు అవగాహన
NEWS Aug 23,2025 06:57 pm
గణేష్ నవరాత్రుల నేపథ్యంలో వినాయక మండపాల నిర్వహణలో భద్రతా చర్యలపై అవగాహన కల్పించేందుకు ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్‌ఐ అనిల్ ఆధ్వర్యంలో చేపట్టగా, మెట్‌పల్లి సీఐ అనిల్‌కుమార్ హాజరయ్యారు. సమావేశంలో ఎంపీడీఓ, ఎంఆర్వో, విద్యుత్ శాఖ ఏఈలతో పాటు గణేష్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. ఎస్‌ఐ అనిల్ మాట్లాడుతూ ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మండప నిర్వాహకులను సూచించారు. సౌండ్ సిస్టమ్ శబ్దం నిర్ణీత పరిమితిలోనే ఉండాలని, ఎలాంటి గొడవలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ వినియోగంలో జాగ్రత్తలు పాటించి, నిమజ్జన కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించాలన్నారు.