సుదర్శన్ రెడ్డిపై అమిత్ షా కామెంట్స్
NEWS Aug 22,2025 07:33 pm
ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిపై కేంద్ర మంత్రి అమిత్ షా తీవ్ర ఆరోపణలు చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సలిజాన్ని ప్రోత్సహించారని ఆరోపించారు. నక్సలైట్లకు మద్దతుగా సుదర్శన్ రెడ్డి తీర్పులు ఇచ్చారని పేర్కొన్నారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపింది ఇండియా కూటమి. అమిత్ షా తన నోటిని అదుపులో పెట్టుకోవాలని సూచించింది. ఇప్పటి వరకు ఎలాంటి మచ్చ లేకుండా సుదర్శన్ రెడ్డి ఉన్నారని పేర్కొంది.