ఆన్ లైన్ గేమింగ్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
NEWS Aug 22,2025 10:21 pm
ఆన్ లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు-2025 కు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో నేటి నుంచి ఆన్ లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు చట్టంగా మారింది. కొత్త చట్టం ప్రకారం ఆన్లైన్ మనీ గేమింగ్ సేవలు నిషేధం. చట్టాన్ని ఉల్లంఘిస్తే గరిష్ఠంగా మూడేళ్లు జైలు శిక్షతో పాటు రూ.కోటి జరిమానా విధిస్తారు.