ఓడిపోతామని తెలిసి పోటీ చేస్తే ఎలా?
NEWS Aug 22,2025 07:32 pm
సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓడి పోతామని తెలిసి కూడా తెలుగు వ్యక్తిని ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం ఎందుకంటూ ప్రశ్నించారు. సీపీ రాధాకృష్ణన్ లాంటి గొప్ప వ్యక్తికి మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. తాము ఎన్నికలకు ముందు నుంచే ఎన్డీయేలో ఉన్నామన్నారు. తమ నుంచి వేరొకరికి మద్దతు ఆశించడం మంచి పద్దతి కాదని సీఎం రేవంత్ రెడ్డికి చురకలంటించారు.