నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా క్రీడా పోటీలు
NEWS Aug 22,2025 05:42 pm
జగిత్యాల: హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్‌చంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆగస్టు 29న నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా జగిత్యాల జిల్లాలో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల శాఖ అధికారి రవికుమార్ తెలిపారు. క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్ వంటి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆసక్తి గల క్రీడాకారులు ఆగస్టు 28లోపు తమ పేర్లను జిల్లా క్రీడల శాఖ అధికారి కార్యాలయంలో నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు: 9059465889