భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో సెప్టెంబర్ 6న జరగనున్న జర్నలిస్ట్ డే వేడుకలకు జబర్దస్త్ నటులు హాజరవుతున్నారు. ఈ విషయాన్ని నటుడు రైజింగ్ రాజు ప్రకటించారు. ప్రెస్ క్లబ్ ఆఫ్ మన బూర్గంపాడు అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆహ్వానం మేరకు తాను సహా పలువురు జబర్దస్త్ కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని తెలిపారు. జిల్లా ప్రజలు పెద్ద సంఖ్యలో విచ్చేసి జర్నలిస్టులను ప్రోత్సహించాలని ఆయన కోరారు.