వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
NEWS Aug 22,2025 05:41 pm
కోరుట్ల: పట్టణంలో జరగబోయే వినాయక నిమజ్జన కార్యక్రమం కోసం కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రవీందర్ ఏర్పాట్లను పరిశీలించారు. బతుకమ్మవాగు, రామాలయం వాగు, ఎకిన్‌పూర్ వాగును సందర్శించిన ఆయన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ దీపాలు, బారికేడ్లు, రోడ్డు మరమ్మతులు, తాగునీటి సదుపాయం వంటి పనులను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్‌తో పాటు డి.ఈ. సురేష్, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.