శ్రీ రాజ బహుదూర్ వెంకటరామరెడ్డి జయంతి
NEWS Aug 22,2025 02:36 pm
మెట్‌పల్లి: డివిజన్ రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో రెడ్డి హాస్టల్ వ్యవస్థాపకులు శ్రీరాజ బహుదూర్ వెంకటరామా రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. మెట్‌పల్లి పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అల్లూరి మహేందర్ రెడ్డి, తిప్పిరెడ్డి అంజిరెడ్డి, పీసు రాజేందర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, అంజయ్య రెడ్డి, రవీందర్ రెడ్డి, గంగాధర్ రెడ్డి, విజయ్ రెడ్డి, శంకర్ రెడ్డి, చిరంజీవి రెడ్డి, మోహన్ రెడ్డి, రాఘవేంద్ర రెడ్డి, రాకేష్ రెడ్డి, ఏనుగు శ్రీనివాస్ రెడ్డి తదితర రెడ్డి సంఘ నాయకులు పాల్గొన్నారు. విద్యా విస్తరణలో శ్రీరాజ బహుదూర్ వెంకటరామా రెడ్డి చేసిన కృషి, ఆయన సేవలను స్మరించుకున్నారు.