పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఈఓ
NEWS Aug 22,2025 03:19 pm
పినపాక: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, విద్య అత్యంత ప్రాధాన్యమని ఎంఈఓ నాగయ్య అన్నారు. ఆయన పినపాక మండలంలోని సీతారాంపురం ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల హాజరును పరిశీలించి, వారు సమయపాలన తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఇకపై పైఅధికారులు నిరంతరం ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తారని, ఎలాంటి లోపాలు తలెత్తినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలన్నారు. మధ్యాహ్న భోజనం వండుతున్న తీరును, వడ్డన విధానాన్ని కూడా ఆయన పరిశీలించారు.