గ్రామ పంచాయతీ భవనాలను నాణ్యతగా నిర్మించాలి: ఎంపీఓ
NEWS Aug 22,2025 03:19 pm
పినపాక ఎంపీ ఓ వెంకటేశ్వరరావు పినపాక మండలం సీతారాంపురం గ్రామం వద్ద నూతనంగా నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవనాన్ని పరిశీలించారు. కొద్ది రోజుల్లో భవన నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలియజేశారు. గ్రామపంచాయతీ భవనాలు నాణ్యతగా నిర్మించాలని ఈ సందర్భంగా ఆయన సంబంధిత కాంట్రాక్టర్ కు సూచించారు. అనంతరం గ్రామపంచాయతీ లలో నిర్వహిస్తున్న శానిటేషన్ పనులను పరిశీలించారు.