పినపాకలో అంగన్వాడీ భవనానికి శంకుస్థాపన
NEWS Aug 22,2025 03:17 pm
పినపాక మండలంలోని సీతారాంపురం గ్రామ పంచాయతీ పరిధిలో "పనుల జాతర–2025" కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ కలిసి అంగన్వాడీ భవన పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కొనసాగుతుందని అధికారులు హామీ ఇచ్చారు.