శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద
NEWS Aug 22,2025 07:32 pm
భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు. 16 గేట్లను ఎత్తి దిగువకు 49280 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. ఇన్ ఫ్లో 80,000 వేల క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 78,812 క్యూసెక్కులకు చేరుకుంది. ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిలువ సామర్థ్యం 79.658 టీఎంసీలుగా ఉందని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు డ్యాం అధికారులు.