ముగ్గురు సైబర్ క్రిమినల్స్ అరెస్ట్
NEWS Aug 22,2025 10:22 am
జగిత్యాల: నకిలీ బ్యాంక్ ఖాతాలు, బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ పేరుతో భారీ సైబర్ మోసం బయటపడింది. కోరుట్లకు చెందిన ఒక బాధితుడి ఖాతా నుంచి రూ.53 లక్షలు, జగిత్యాల పట్టణానికి చెందిన మరో బాధితుడి ఖాతా నుంచి రూ.21 లక్షలు మోసగాళ్లు దోచుకుపోయారు. ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. కోరుట్ల సీఐ సురేష్, బుగ్గారం ఎస్సై సతీష్, సైబర్ క్రైమ్ ఎస్సైలు కృష్ణ, దినేష్ కుమార్ సూత్రప్రాయంగా విచారణ జరిపారు. నిందితులు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు.