జూరాల ప్రాజెక్టు 31 గేట్లు ఎత్తివేత
NEWS Aug 22,2025 09:43 am
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో 31 గేట్లు ఎత్తివేసి దిగువకు నీళ్లను వదిలారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు ఉండగా ప్రస్తుతం నీటి మట్టం 316.540 మీటర్లుగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 6.004 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 3,50,000 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 3,40,999 క్యూసెక్కుల వద్ద నీరు నిలిచి ఉంది. భారీగా నీళ్లు నిండు కోవడంతో ఐదు విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ కొనసాగుతోంది.