సెక్యూరిటీ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లు
NEWS Aug 22,2025 08:52 am
తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ట్రాన్స్ జెండర్స్ ను సెక్యూరిటీ విధుల్లోకి తీసుకోనున్నట్లు తెలిపింది. జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, హెచ్ఎండీఏల్లో వీరి సేవలను వినియోగించు కుంటున్నట్లు తెలిపింది. గత ఎనిమిది నెలలగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా సేవలు అందిస్తున్న వీరిని మరికొన్ని విభాగాల్లోను సేవలు వినియోగించు కోవాలని భావిస్తోంది. దశల వారీగా ఐటీ కంపెనీలకు కూడా సెక్యూరిటీ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లను తీసుకునేలా ప్లాన్ చేస్తోంది.