కొండా సురేఖతో విభేదాలు లేవు
NEWS Aug 22,2025 08:47 am
తనకు మంత్రి కొండా సురేఖకు మధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ స్పష్టం చేశారు మంత్రి సీతక్క. సమాజంలో ఆడబిడ్డలు ఎదుగుతుంటే ఓర్వ లేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు కావాలని తమపై బురద చల్లేందుకు, విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటివి ఏవీ తమను విడదీయ లేవన్నారు.