నేడు తెలంగాణ బంద్
NEWS Aug 22,2025 08:41 am
స్థానిక వ్యాపారులపై గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు దౌర్జన్యం చేస్తున్నారంటూ ఇవాళ తెలంగాణ బంద్‌కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది. ప్రజలు బంద్‌కు సహకరించాలని కోరింది. ఈ బంద్‌కు పలు జిల్లాల్లోని వ్యాపారులు, పలు సంఘాల నాయకులు మద్దతు ఇచ్చారు. నల్గొండ, వరంగల్, జనగామ, మక్తల్, దేవరకొండ సహా పలు ప్రాంతాల్లో షాపులు మూసివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.