అరుణాచల్ ప్రదేశ్ సీఎం తో బండి భేటీ
NEWS Aug 22,2025 08:35 am
ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమాఖండూతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఈ సందర్బంగా సీఎంకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పపుంపుర జిల్లాలోని యుపియా గ్రామం వద్దనున్న ఐటీబీపీ 31వ బెటాలియన్ హెడ్‌క్వార్టర్స్ సందర్శించారు. అమరవీరుల ఘాట్ వద్ద పూలమాల వేసి వీరమరణం పొందిన ఐటీబీపీ జవాన్లకు నివాళి అర్పించారు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) జవాన్ల ధైర్య సాహసాలు మరువలేమని కొనియాడారు.