సీఎం రేవంత్ రెడ్డికి మెగాస్టార్ థ్యాంక్స్
NEWS Aug 22,2025 08:31 am
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడంలో కీలక పాత్ర పోషించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. గత 18 రోజులుగా 30 శాతం వేతనాలు పెంచాలని కోరుతూ సినీ కార్మికులు ఆందోళన చేపట్టారు. చివరకు సీఎం జోక్యం చేసుకోవడంతో సమస్య సద్దుమణిగింది. దీంతో ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు ఫెడరేషన్ బాధ్యులు. ఇవాల్టి నుంచి షూటింగ్స్ ప్రారంభం కానున్నాయి.