ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
NEWS Aug 22,2025 08:21 am
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోంది గోదావరి . ధవళేశ్వరం వద్ద నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉండడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్రంలోకి 13 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు హెడ్ వర్క్స్ ఈఈ శ్రీనివాస రావు. సాయంత్రానికి బ్యారేజీకి 14 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉందన్నారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.