గీత దాటితే వేటు తప్పదు - సీఎం
NEWS Aug 22,2025 08:18 am
ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యతతో వహిస్తారంటూ ప్రశ్నించారు. తప్పుచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ నిబంధనలకు లోబడి ఉండాల్సి ఉంటుందని, ఆ విషయం మరోసారి చెప్పాల్సి రావడం దారుణమన్నారు. ప్రతి ఒక్కరికీ ఒక లైన్ అంటూ ఉంటుంది, దానిని దాటాలని ప్రయత్నం చేస్తే తోక కట్ చేస్తానన్నారు.