రాష్ట్ర ప్రయోజనాల కోసమే మద్దతు
NEWS Aug 22,2025 08:14 am
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ కు వైసీపీ మద్దతు ఇవ్వాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు. నంబర్ గేమ్ ఉండొద్దనే మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇదే విధానాన్ని అవలంభిస్తూ వచ్చామని పేర్కొన్నారు. అప్పట్లో యూపీఏ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చామని తెలిపారు. తమ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు బొత్స.