ఏపీ లిక్కర్ స్కాం కేసులో రూ. 116 కోట్లు స్వాధీనం
NEWS Aug 22,2025 08:05 am
ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటి వరకు రూ.116.63 కోట్ల ఆస్తులు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది సిట్. కేసులో భాగంగా నిందితులు, నిందితుల బంధువులు, డిస్టలరీలకు చెందిన బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసినట్లు తెలిపింది. రూ.8.36 కోట్ల విలువ చేసే స్థిరాస్తులను అటాచ్‌మెంట్ చేశామని, డిస్టలరీలు, నిందితుల బ్యాంక్ అకౌంట్లలో ఉన్న రూ.57.48 కోట్లు ఫ్రీజ్‌చేసినట్లు పేర్కొంది.