ఎంపీలు పార్టీలకు అతీతంగా ఓటు వేయాలి
NEWS Aug 22,2025 08:02 am
ఎన్డీఏ కూటమికి సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ ఎన్నికలో విప్ ఉండదన్నారు ఎంపీ మల్లురవి. పార్టీలకు అతీతంగా ఎంపీలు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతుగా నిలబడాలని కోరారు. జస్టిస్ ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు రాబోతున్నాయని జోష్యం చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోని ఎంపీలందరూ జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు.