ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్
NEWS Aug 22,2025 07:59 am
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అవుతారు. పలు ప్రాజెక్టులకు, రాష్టానికి ఆర్థిక సహాయం అందించాలని కోరనున్నారు. అనంతరం నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగారియాతో సమావేశం అవుతారు. ఎకనామిక్ టైమ్స్ నిర్వహిస్తున్న వరల్డ్ లీడర్స్ ఫోరం కార్యక్రమంలో పాల్గొంటారు చంద్రబాబు .