స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
NEWS Aug 22,2025 07:55 am
గువ్వల బాలరాజు పార్టీ నుండి వీడినా వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు మర్రి జనార్దన్ రెడ్డి. అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండల BRS పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పని చేయాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ నుంచి ఎవరు వెళ్లినా వారికే నష్టం తప్పా పార్టీకి కాదని గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రతి ఊరులో గులాబీ జెండా రెప రెప లాడాలన్నారు.