సినీ కార్మికుల సమ్మె విరమణ
NEWS Aug 22,2025 07:52 am
గత 18 రోజులుగా 30 శాతం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన కార్మికులు చేపట్టిన ఆందోళనను విరమించారు. నిర్మాతలు, ఫెడరేషన్ నేతల మధ్య చర్చలు ఫలప్రదం అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవడం, టీఎఫ్ సీ చైర్మన్ దిల్ రాజు చొరవ చూపడంతో ఎట్టకేలకు ప్రతిష్టంభనకు తెర పడింది. రెండు స్లాబులు అమలు చేసేందుకు నిర్మాతలు అంగీకారం తెలిపారని, దీంతో సమ్మెను విరమించినట్లు తెలిపారు ఫెడరేషన్ చైర్మన్ అనిల్ అట్లూరి.